భార‌త బౌల‌ర్ల దెబ్బ‌కు బంగ్లా విల‌విల

Bangla is worth the blow of the Indian bowlersనవతెలంగాణ – హైదరాబాద్: చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో జ‌రుగుతున్న తొలి టెస్టులో భార‌త బౌల‌ర్ల దెబ్బ‌కు బంగ్లాదేశ్ విల‌విల‌లాడుతోంది. 92 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయింది. నిప్పులు చెరిగే బంతులు విసిరిన భార‌త బౌల‌ర్ల ముందు బంగ్లా బ్యాట‌ర్ల వ‌ద్ద స‌మాధాన‌మే లేకుండా పోయింది. మొద‌ట్లో 40 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయి పీక‌ల‌లోతు క‌ష్టాల్లో ప‌డ్డ ఆ జ‌ట్టును ష‌కిబుల్ హాస‌న్ (32), లిట్ట‌న్ దాస్ (22) ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ ద్వ‌యం 51 ప‌రుగుల భాగ‌స్వామ్యం అందించింది. భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్‌, ర‌వీంద్ర జ‌డేజా చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా… మ‌హ్మ‌ద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ 35 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 7 వికెట్ల‌కు 110 ప‌రుగులు చేసింది. క్రీజులో మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్ (10 బ్యాటింగ్), హ‌స‌న్ ముహమూద్ (9 బ్యాటింగ్) ఉన్నారు. ఇంకా టీమిండియా కంటే బంగ్లా 266 ప‌రుగులు వెనుకబ‌డి ఉంది. అంత‌కుముందు భార‌త్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 376 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే.

Spread the love