నవతెలంగాణ – బంగ్లాదేశ్ : ఈసారి వెస్టిండీస్, యూఎస్‌ఏ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును మెగా ఈవెంట్‌కు ఎంపిక చేసింది. ఈ టీమ్‌ను లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో నాయకత్వం వహించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా తస్కిన్ అహ్మద్ ఎంపికయ్యాడు. కెప్టెన్ శాంటోతో పాటు లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లాలతో కూడిన బంగ్లా బ్యాటింగ్ లైనప్ కాస్త బలంగానే ఉంది. ఇక బౌలర్ల విషయానికొస్తే.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్, షరిఫుల్ రహ్ ఇస్లాం, తంజిమ్ హసన్ రూపంలో నలుగురు పేసర్లు.. తన్వీర్ ఇస్లాం, మహేదీ హసన్ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. జట్టులో ఐదారుగురు ఆల్‌రౌండర్లు ఉండటం వారికి అదనపు బలం.
బంగ్లాదేశ్ స్క్వాడ్ : నజ్ముల్ హుసేన్ శాంటో(కెప్టెన్), తస్కిన్ అహ్మద్(వైస్ కెప్టెన్), లిట్టన్ దాస్, సౌమ్యా సర్కార్, తంజిద్ హసన్ తమీమ్, షకిబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా రియాద్, జకేర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షక్ మహెది హసన్, రిషద్ హొసేన్, ముస్తాఫిజర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తంజీం హసన్ షకీబ్.