అంపైర్ నిర్ణయం వల్ల ఓడిపోయిన బంగ్లాదేశ్..

నవతెలంగాణ – బంగ్లాదేశ్:  నిన్న బంగ్లాదేశ్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో అంపైర్ తప్పుడు నిర్ణయం, ఐసీసీ రూల్స్ వల్ల బంగ్లాదేశ్ ఓటమి పాలైంది. సౌతాఫ్రికాపై 16.2వ బంతికి బంగ్లా బ్యాటర్ మహ్మదుల్లాను అంపైర్ LBWగా ప్రకటించారు. ఆ బంతి ప్యాడ్‌కు తగిలి బౌండరీకి వెళ్లింది. బంగ్లా రివ్యూకు వెళ్లగా అది నాటౌట్ అని తేలింది. రూల్స్ ప్రకారం అంపైర్ నిర్ణయం తీసుకోగానే అది డెడ్ బాల్‌గా మారుతుంది. దీంతో బౌండరీ వెళ్లినా ఫోర్ ఇవ్వలేదు. చివరికి బంగ్లా 4 రన్స్ తేడాతో ఓడింది.

Spread the love