– బాన్సువాడ సన్నబియ్యంకు విదేశాల్లో డిమాండ్.
– ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫ్లెక్సీ లు ఏర్పాటు చేయాలి
– స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ – నసురుల్లాబాద్
ముందస్తు వరి పంట సాగులో బాన్సువాడ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రతి వ్యవసాయ సమీక్షలో బాన్సువాడ నియోజకవర్గంను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తారని రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ పరిధిలోని నసురుల్లాబాద్ నెమ్లి సాయిబాబా కళ్యాణ మండపంలో బాన్సువాడ నియోజవర్గ స్థాయి ముందస్తు వరి పంట సాగుపై రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం కు రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు , వ్యవసాయ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ముందుగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులు ముందస్తు వరి సాగుపై అవగాహన పెంచుకోవాలని, వానకాలం వరి పంటలు మే చివరివారం జూన్ చివరి వారం వరకు వరి నాట్లు వేసుకుంటే అక్టోబర్ రెండో వారంలో వరి కోతలు వచ్చేలా చూసుకోవాలన్నారు, యాసంగి పంటలు నవంబర్ లో నారుమాల్లు వేసి డిసెంబర్ చివరి వారం లో వరి నాట్లు వేసుకుంటే మార్చు చివరి కల్లా వరి కోతులు వచ్చేలా చూసుకోవాలి అన్నారు. నూతన వంగడాలతో ముందస్తు పరి సాగు వలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. నూతన వంగడాల వలన అధిక వర్షాలు, చీడ పీడలు లేకుండా పంట దిగుబడి పెంచుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలోని బాన్సువాడ నియోజకవర్గంలో వానాకాలం పండే సన్న రకం బియ్యానికి విదేశాలలో కూడా డిమాండ్ ఉన్నదని. అందుకు నల్గొండ, ఆంధ్ర, తమిళనాడు ఇతర ప్రాంతాల నుండి వ్యాపారులు వచ్చి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న వడ్లను కొనుగోలు చేస్తారని తెలిపారు. నియోజవర్గంలో రైతులకు విత్తనాలు, ఎరువులకు కొరత లేదన్నారు. వచ్చే 50 ఏళ్ళ వరకు బాన్సువాడ నియోజకవర్గంలో విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేవని, అలాగే దామరంచ వద్ద రూ. 70 కోట్లతో 220 కేవి విద్యుత్తు సబ్ స్టేషన్ ఏర్పాటు పూర్తయ్య అన్నారు. రాష్ట్రంలో 2014 లో 1.08 కోట్ల ఎకరాల సాగు భూమి ఉంటే నేడు 2.18 కోట్ల ఎకరాలకు పెరిగిందన్నారు. 2014 లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వరి ధాన్యం ఉత్పత్తి 36 లక్షల మెట్రిక్ టన్నులు కాగా. అదే 2021-22 లో 1.30 కోట్ల టన్నులకు పెరిగిందన్నారు. దేశ వరి పంట ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం లోనే 60% వరి పంట ఉత్పత్తి సాగుతుందన్నారు. ముందస్తు వరి పంట సాగులో గత కొన్ని ఏండ్లు గా బాన్సువాడ నియోజవర్గం లోని ఉమ్మడి వర్ని, కోటగిరి, బీర్కూర్ మండలాల్లో ముందస్తు వరి పంటల సాగు కాగా బాన్సువాడ మండలంలో, బుడ్మి, కొత్తబాది, తిర్మాలపుర్, తడ్కోల్, తదితర గ్రామాల రైతులు వెనుకంజులో ఉన్నారని ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాలంటే రైతులు 15 రోజులు ముందు వరి నాట్లు వేసుకోవాలని సూచించారు.
వ్యవసాయ శాఖ పై అసహనం
నస్రుల్లాబాద్ మండల వ్యవసాయ అధికారులు తప్పుడు నివేదికలు ఇవ్వడంతో అధికారులపై సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి, రైతులను కలిసి నివేదికలు రూపొందించాలి. గాలి లెక్కలు రాయవద్దు హెచ్చరించారు. హలో రైతు వేదికలు ఇప్పటికీ ఏ ఈ ఓ లు వెళ్లడం లేదని, రైతు వేదికల తాళాలు తీసి రైతులకు అవగాహన కల్పించే వారే కరువాయాలని వీరిపై శాఖ వలన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు.
ప్రతి గ్రామంలో ప్రగతి నివేదిక పెక్సీలను ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు గ్రామాల్లో మంజూరైన నిధుల వివరాలు, పూర్తయిన అభివృద్ధి పనుల వివరాలను ఫ్లెక్సీ రూపంలో గ్రామాలు మూడు నాలుగు ఏర్పాటు చేయాలన్నారు. చేసిన అభివృద్ధికి సంబంధించిన ఫోటోలను పెక్సిల్లో పెట్టాలని సూచించారు, ప్రతి సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నివేదికలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్, కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రమోహన్, బోధన్ బాన్సువాడ ఆర్డీవోలు రాజా గౌడ్ రాజేశ్వర్, రుద్రూర్ కృషి విజ్ఞాన్ కేంద్రం, ఏరువాక కేంద్రం, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతుబంధు సమితి అధ్యక్షులు, తహసీల్దార్లు, ఎంపీడీఓల్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు ఎంపీటీసీలు, ఇతర శాఖ అధికారులు హాజరయ్యారు.