ఏచూరి మృతికి బాన్సువాడ సీపీఐ(ఎం) నాయకుల సంతాపం

నవతెలంగాణ – బాన్సువాడ/నసురుల్లాబాద్
సీపీఐ(ఎం)జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనితో బాన్సువాడ నియోజకవర్గంలో వివిధ పార్టీల నాయకులు సీపీఐ(ఎం) నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతికి సంతాపంగా బాన్సువాడలో వాట్సాప్ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. వారి ఆత్మకు శాంతి కలగాలంటూ నేటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజలతో సీతారాం ఏచూరికి మంచి అనుబంధం ఉందని. భారతదేశ రాజకీయాల్లో ఆయన అత్యంత గౌరవనీయ వ్యక్తి అని  అభివర్ణించారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారా ఏచూరి మరణం పట్ల ఆ పార్టీ తీవ్ర దిగ్బంతి వ్యక్తం చేసింది. విద్యార్థి దశ నుంచి ఉద్యమంలో పాల్గొనే ఏచూరి సీతారాం అంచలంచలుగా జాతీయస్థాయికి ఎదిగారు. 1952లో ఆగస్టు 25న చెన్నైలో జన్మించిన సీతారాం ఏచూరి. సీతారాం ఏచూరి తల్లిదండ్రులు ఏపీలోని కాకినాడ వాసులు. చెన్నైలో పెరిగి హైదరాబాద్లో విద్యాభ్యాసం చేసిన సీతారాం ఏచూరి. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో ఆర్థిక శాస్త్రంలో బిఎ చదివిన ఏచూరి. ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం లో ఎంఏ చదివిన ఏచూరి. ఏచూరి ఢిల్లీకి తీసుకువచ్చిన 1969 నాటి తెలంగాణ ఉద్యమం. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరిన సీతారాం. ఏడాది తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిన ఏచూరి. 1975లో ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి ఉద్యమకారుడుగా అరెస్టు అయిన ఏచూరి. 1977-78లో మూడుసార్లు జేఎన్యు అధ్యక్ష ఎన్నికల్లో ఏచూరి ఎన్నికయ్యారు. 1978లో ఎస్ఎఫ్ఐ అఖిలభారత జాయింట్ కార్యదర్శిగా ఏచూరి ఎన్నిక . 1984లో సిపిఐ లో కేంద్ర కమిటీ ఎన్నిక అయినా ఏచూరి సీతారాం. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సీతారాం ఏచూరి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ ప్రజల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు సీతారాం ఏచూరి. కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం ఆ పార్టీకి తీరని లోటు. విద్యార్థి దశ నుంచి ఉద్యమంలో పాల్గొని జాతీయస్థాయికి ఎదిగిన సీతారాం ఏచూరి కన్నుమూయడం ఎంతో బాధాకరమని సిపిఎం పార్టీ తీవ్రంగా సంతాపం వ్యక్తం చేసింది.

Spread the love