బాన్సువాడ ఉప ఎన్నికలు తథ్యం

Banswada by-elections are underway.– బెదిరించిన వారి పేర్లు పింక్ బుక్కులో ఎంట్రీ చేస్తాం..
– రజోత్సవ సభను విజయవంతం చేయాలి…
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల.. కవిత
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయమని, బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించే వారి పేర్లు పింక్ బుక్ లో రాసుకొని,  బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో రజతోత్సవ సన్నహాక సభలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి లతో కలసి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో పదవులు ఎన్నో లాభాలు పొంది నేడు ప్లేట్ ఫిరాయించన వారు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లొద్దని కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందన్నారు, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లన్నింటినీ పింక్ బుక్ లో రాసుకుంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
హామీలు కొండ అంతా ..అమలు గొరంతా
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీలు కొండంతా. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అమలు గోరంతా అని అన్నారు. మాట తప్పడం…మడమ తిప్పడమే కాంగ్రెస్ నైజమని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్టులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి పంచి ఓట్లేయించుకున్నారని కవిత గుర్తు చేశారు. ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని, గతంలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అరిగోస పెట్టిందని కవిత అన్నారు. వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీ, ఏడాదిన్నర పాలనలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఆమె వెటకారంగా మాట్లాడారు.
రజతోత్సవం ను విజయవంతం చేయాలి
బాన్సువాడ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు రజతోత్సవ సభకు రావాలని కోరారు. తెలంగాణ గడ్డ మీద అగ్గి పుట్టించి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదన్నారు. ఆంధ్రుల పాలనలో నలిగిపోయిన ఆత్మగౌరవాన్ని తెలంగాణలో తిరిగి రెపరెపలాడించింది బీఆర్ఎస్ పార్టీయేనని కవిత ఘంటాపథంగా చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గం కార్యకర్తల తరలింపు కు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాధ్యత తీసుకుంటున్నారని బస్సుల సౌకర్యం ఇతర ఏ సమస్య ఉన్న బాన్సువాడ నియోజకవర్గ నాయకుడు సంప్రదించాలని ఆమె అన్నారు. స్వతంత్ర దేశంలో లక్ష్యాన్ని చేరిన ఏకైక పోరాటం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమం మాత్రమేనన్నారు. వీరులు మాత్రమే లక్ష్యం చేరే వరకు పోరాటం చేస్తారని, అది ఒక్క కేసీఆర్ తోనే సాధ్యమైందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పంథాను నమ్ముకొని హింసాయుతంగా పోరాటం చేసి తెలంగాణను సాధించామని కవిత గుర్తు చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ మొదటి అడుగు వేశారని, కేంద్ర మంత్రి పదవిని సైతం గడ్డిపోచలా వదిలేసిన ఘనత కేసీఆర్ దన్న విషయం తెలంగాణాలోఏ చెట్టునూ, పుట్టను అడిగినా చెపుతాయని కవిత అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం నేత షేక్ జుబేర్ వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love