బషీరాబాద్ రైటర్, సింగర్ బొమ్మ రాముకు ఘనంగా సన్మానం

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని బషీరాబాద్ గ్రామానికి చెందిన రైటర్,  సింగర్ బొమ్మ రామును గ్రామంలోని పెద్దలు, యువత, ఉపాధ్యాయులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఇటీవల రాము రచించి పాడిన అమ్మ సాంగ్ యూట్యూబ్ లో తెలంగాణ వ్యాప్తంగా మంచి పేరు ప్రత్యేకతలు తీసుకురావడంతో హర్షం వ్యక్తం చేస్తూ శాలువాతో సత్కరించి  అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ బొమ్మ రాము మరిన్ని పాటలు రచిస్తూ, పాడుతూ గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో సినిమాలో కూడా అవకాశం వస్తే పాటలు రచిస్తూ పాడుతూ మంచి పేరు ప్రఖ్యాతలు పొంది గ్రామ యువతకు ఆదర్శంగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో హకీమ్, మెట్ పల్లి సురేందర్, స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనక గంగాధర్, పిఇటి గంగాధర్, ఉపాధ్యాయులు మధుసూదన్, ధర్మేందర్, రవీందర్, రమేష్ కుమార్, భాగ్యలక్ష్మి, గంగామణి, శోభ, శైలజ, గ్రామ యువత, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love