ఎంపీడీవో కార్యాలయం వద్ద బతుకమ్మ సంబరాలు..

– ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచాలన్నదే కెసిఆర్ లక్ష్యం...
నవతెలంగాణ- మునుగోడు: మునుగోడు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద గురువారం  అధికారులు, ప్రజా ప్రతినిధులు  ఆరవ రోజు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జానపద పాటలతో  చప్పట్లు వేస్తూ సంబరంగా బతుకమ్మ పండుగ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  ఆడపడుచుల ఆత్మగౌరవం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడంతో పాటు ప్రతి బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరను అందజేసి ఆడబిడ్డల కు ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్ భాస్కర్, ఎంపీ ఓ సుమలత, వివిధ గ్రామాల గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.
Spread the love