శ్రీ ఆదర్శలో అంబరానంటిన బతుకమ్మ సంబరాలు

నవతెలంగాణ- చింతకాని :చింతకాని మండలంపరిధిలోని నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బతుకమ్మ సంబరాలు శనివారం అంబరాన్నంటాయి. విద్యార్థులు తరగతుల వారీగా బతుకమ్మలు తయారుచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోలాటం ఆటపాటలతో బతుకమ్మ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. బతుకమ్మ పండుగ చరిత్ర, ప్రాధాన్యత, విశిష్టత గురించి విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్ వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చావా అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు రేణుక, వినీల, పార్వతి, రాసి, త్రివేణి, రాధా, నాగ దుర్గా తదితరులు పాల్గొన్నారు.

Spread the love