డిజిటల్ లో ఆధిపత్యం కోసం యుద్ధం

మోజ్ కింగ్ & క్వీన్ టైటిల్స్
మోజ్ కింగ్ & క్వీన్ టైటిల్స్

– మోజ్ కింగ్, మోజ్ క్వీన్ టైటిల్స్ ను గెలుచుకునేందకు పోటీ పడుతున్న భారతదేశంలోని టాప్ కంటెంట్ క్రియేటర్స్

నవతెలంగాణ హైదరాబాద్: డిజిటల్ రంగంలో మీరు ఆధిపత్యం చెలాయించాలని అనుకుంటున్నారా. మీరు ఈ డిజిటల్ రంగంలో కంటెంట్ లో కింగ్ లేదా క్వీన్ అవ్వాలని అనుకుంటున్నారా. మీ సత్తాని ఈ ప్రపంచానికి తెలియచేయాలని అనుకుంటున్నారా. అయితే ఈ అద్బుతమైన అవకాశం మీ కోసమే. ఈ సెప్టెంబరులో మిమ్మల్ని మీరు అద్బుతంగా నిరూపించుకునే అవకాశం మీకోసం సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని పద్ధతిలో, మునుపెన్నడూ లేని విధంగా భారతదేశపు అతి పెద్ద షార్ట్ వీడియో యాప్ అయినటువంటి మోజ్… మోజ్ కింగ్, మోజ్ క్వీన్ పేరుతో దేశవ్యాప్తంగా మొదటి ఎడిషన్‌ పోటీను ప్రారంభించింది. అందం, ప్రతిభ మరియు ప్రామాణికతను సంపూర్ణంగా మిళితం చేసే నాలుగు రౌండ్ ల పోటీ నిర్వహిస్తారు. ఈ పోటీ సెప్టెంబరు 1 నుండి సెప్టెంబర్ 30 వరకు జరుగుతుంది. ఇందులో అన్ని ప్రాంతాలకు చెందిన కంటెంట్ క్రియేటర్స్ పోటీ పడతారు. తమ అత్యున్నత ప్రదర్శనను ఇస్తారు.
ఏడాదికి రెండుసార్లు, ప్రతి ఆరు నెలలకొకసారి నిర్వహించే ఈ విలక్షణ కాంపిటీషన్, ఉప పోటీలు మరియు మినీ టాలెంట్ షోకేస్‌ల రూపంలో జరుగుతాయి. దీనిద్వారా కంటెంట్ క్రియేటర్స్ తమ నైపుణ్యాలను చాటుకోవడానికి అనువైన వేదిక లభిస్తుంది. ప్రతి రౌండ్‌లో పాపులర్ అయినటువంటి క్రియేటర్స్ ని గుర్తిస్తారు. అంతేకాకుండా వారికి రివార్డులను కూడా అందిస్తారు. మిస్టర్ రాక్‌స్టార్ మోజీ మరియు మిస్ రాక్‌స్టార్ మోజీ (ఇద్దరు రన్నరప్‌లు) లాంటి అద్భుతమైన టైటిల్ కోసం క్రియేటర్స్ పోటీపడతారు. అంతిమంగా గ్రాండ్ విన్నర్స్ మోజ్ కింగ్, మోజ్ క్వీన్ కిరీటాన్ని అందుకుంటారు. విజేతలుగా నిలిచిన క్రియేటర్స్ అందరికి నగదు బహుమతులు పొందే అవకాశం ఉంటుంది. గెలుపొందిన విజేతలు మోజ్ వినియోగదారుల నుండి ప్రత్యేకమైన వర్చువల్ బహుమతులు గెల్చుకుంటారు. అంతేకాకుండా పోటీలో చురుకుగా పాల్గొనడం ద్వారా వారు పొందే మద్దతు ఆధారంగా షార్ట్‌ లిస్ట్ చేయబడతారు.
ఈ సందర్బంగా కంటెంట్ స్ట్రాటజీ మరియు ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్, మోజ్ మరియు షేర్ చాట్ శ్రీ శశాంక్ శేఖర్ మాట్లాడారు. ఆయన మాట్లాడుడూ.., “ఈ మోజ్ కింగ్ మరియు మోజ్ క్వీన్‌ ద్వారా, మా క్రియేటర్ కమ్యూనిటీలో ఉన్న అద్భుతమైన టాలెంట్ ను బయటకు తీసుకురావాలని అనుకుంటున్నాము. లైవ్ స్ట్రీమింగ్, క్రియేటివ్ బ్యాటిల్స్ ద్వారా వారిలోని టాలెంట్ ను మేం బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. స్వీయ-వ్యక్తీకరణ, వ్యక్తిగత ఎదుగుదలను ప్రేరేపించడం ద్వారా మా కమ్యూనిటీని మరింత శక్తిమంతం చేసే ప్లాట్‌ఫారమ్‌ను ప్రోత్సహించడమే మా లక్ష్యం. ఇది వారి వ్యక్తిత్వాలను ప్రతిబింబించే కంటెంట్‌ను సృష్టించినప్పుడు మద్దతు మరియు అసమానమైన గుర్తింపు యొక్క పర్యావరణ వ్యవస్థను కూడా ప్రారంభిస్తుంది అని అన్నారు.
క్రియేటర్స్ నాలుగు థీమ్ ల రౌండ్ లలో తమ అద్బుతమైన కంటెంట్‌ను ప్రదర్శిస్తారు.

  • టాస్క్ 1 – #ShowUsYourJalwa, సెప్టెంబరు 6 మరియు 7 తేదీల్లో ఈ టాస్క్ జరుగుతుంది. క్రియేటర్స్ పాటలు పాడటం, డ్యాన్స్, మేకప్, ఫ్యాషన్ లేదా గేమింగ్‌లో తమ ప్రత్యేక ప్రతిభను ప్రదర్శించాల్సి ఉంటుంది. కామెడీ సృష్టికర్తలు మనం కింద పడి పడి నవ్వేలా మనల్ని నవ్వించాలి. ఆర్ట్ క్రియేటర్‌లు మా డీఐవై ప్రాజెక్ట్‌ లను ఎలా తయారు చేయాలో చూపిస్తారు.
  • టాస్క్ 2 – #KismeKitnaHaiDum సెప్టెంబర్ 13 నుంచి 14 వరకు ఈ టాస్క్ జరుగుతుంది. ఇందులో ఉత్తేజకరమైన సవాళ్లు ఉంటాయి. క్రియేటర్స్ థీమ్‌లతో కూడిన చిన్న-పోటీలలో పాల్గొంటారు. మిర్చి కాంటెస్ట్‌ లో ఎవరు ఎక్కువ మిరపకాయలు తినగలరని మీరు అనుకుంటున్నారు.? లేదా “నవ్వకూడదు” అనే ఛాలెంజ్‌లో ఎవరు నవ్వకుండా ఉండగలరు తెలుసా, ఇలాంటివి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి.!
  • టాస్క్ 3 – #AsliMoj సెప్టెంబర్ 20 నుంచి 21 వరకు జరుగుతుంది. క్రియేటర్స్ ఇక్కడ లైవ్ లో పోటీలో పాల్గొంటారు. పోటీదారులకు నిజంగా సంతోషం కలిగించేది ఏమిటో వారు ఇక్కడ చేసి చూపిస్తారు. ఇది వారి వారి జీవితంలో జరిగిన చిన్న చిన్న క్షణాల గురించి కావొచ్చు లేదా రోజువారీ సంఘటనలు కూడా కావొచ్చు. “తాప్రీ కి చాయ్” నుండి “కేఫ్ కి కాఫీ”ని పోల్చడం నుండి “బారిష్ మరియు భీగ్నా” మరియు “వాటర్ పార్క్” సరదాగా ఎంచుకోవడం వరకు… అన్నీ ఉంటాయి ఇందులో.
  • టాస్క్ 4 – సెప్టెంబర్ 27 మరియు 28 తేదీల్లో జరుగుతుంది. ఇది చిట్ట చివరి టాస్క్. #CreatorsKiJung క్రియేటర్‌లు మూడు క్రియేటర్స్ యుద్ధాల్లో పాల్గొంటారు. ఇక్కడ వారు తమ అనుచరుల నుండి గరిష్ట మద్దతును పొందాలనే లక్ష్యంతో ఉంటారు.

క్రియేటర్‌ లు మోజ్ కింగ్ లేదా క్వీన్‌కి అర్హత సాధించాలంటే, వారు కనీసం నాలుగు ఉప-పోటీలలో ఒకదానిలో పాల్గొనాలి. కనీసం 45 నిమిషాలు లైవ్ లో తమ టాలెంట్ ను చూపించ గలగాలి. కనీసం 10-30 నిమిషాల పాటు క్రియేటర్స్ బ్యాటిల్ లో పాల్గొనాలి. దీంతోపాటు వారికి వారి అనుచరుల నుండి గరిష్ట మద్దతు కూడా లభించాలి. రండి, ఈ నెల రోజులపాటు జరిగే టాలెంట్ సమంలో భాగం అవ్వండి.

Spread the love