బీసీ బందు పథకంపై విచారణ జరిపించాలి

– సీపీఐ దూల్మిట్ట మండల కన్వీనర్‌ నరసింహ చారి
నవతెలంగాణ-మద్దూరు
ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బీసీ బంధు పథకంపై విచారణ జరిపించి పేదలకు న్యాయం చేయాలని సిపిఐ ధూల్మిట్ట మండల కన్వీనర్‌ వలబోజు నరసింహ చారి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం ధూల్మిట్ట మండల కేంద్రంలోని ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బీసీ బంధు పథకం పక్కదారి పట్టిందని, నిజమైన లబ్ధిదారులకు కాకుండా కేవలం బీఆర్‌ఎస్‌ నాయకులకే ఇచ్చారని ఆయన ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి పేద బీసీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సీపీఐ నాయకులు బండారి సిద్దయ్య, తిగుల్ల కనకయ్య, అబ్దుల్‌ రసూల్‌ తదితరులు ఉన్నారు

Spread the love