పది ఫలితాలలో మొదటి స్థానంలో బీసీ బాలికల గురుకుల పాఠశాల

– వరుసగా రెండోసారి మొదటి స్థానంలో కైవసం చేసుకున్న బీసీ గురుకుల పాఠశాల..
నవతెలంగాణ – మునుగోడు
పదవ తరగతి ఫలితాలలో మండలంలో  10/10 సాధించి  మొదటి స్థానంలో మహాత్మ జ్యోతిబా పూలే బీసీ బాలికల  సంక్షేమ గురుకుల పాఠశాల లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత ఫలితాలు సాధించగా ముగ్గురు విద్యార్థులు 10/10 సాధించి మండలంలో గత రెండు సంవత్సరాలుగా మొదటి స్థానం లో నిలిచారు . ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నర్మద మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా మండలంలో తమ పాఠశాలకు మొదటి స్థానం గర్వకారణమని  అన్నారు .తమ పాఠశాలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు 10/10 సాధించిన విద్యార్థులకు , ఉత్తీర్ణత ఫలితాల సాధన కోసం కృషిచేసిన ఉపాధ్యాయ బృందానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love