నవతెలంగాణ – జక్రాన్ పల్లి
భారతదేశము నుండి టీబీ వ్యాధిని పారదోలడానికి వయోజనులకు బీజీసీ వ్యాక్సినేషన్ అవసరమని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ శుక్రవారం అన్నారు. జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వయోజనులకు బీసీజీ వ్యాక్సినేషన పై ఇంటింటి ఇంటింటి సర్వే కొరకు మండలంలోని ఏఎన్ఎం లకు ఆశా వర్కర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇమినైజేషన్ అధికారి డాక్టర్ అశోక్ హాజరై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడల్ట్ బిసిజి వ్యాక్సినేషన్‌పై అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్‌పై ఇంటింటికి సర్వే కొరకు ఎఎన్ఎమ్, ఆశాలందరు సిద్ధంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా ఎన్ డి డి కోసం 1-19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ ఇవ్వడం ద్వారా వార్మ్ ఇన్ఫెక్షన్ను నివారించడానికి మరియు వార్మ్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి ఉద్దేశించబడిందని తెలిపారు. వయోజన బీసీజీ టీకాపై ఇంటింటికి సర్వే చేయడానికి శిక్షణ ఇచ్చారు. అడల్ట్ బీసీజీ టీకా కార్యక్రమం ఆగస్టు 2024 నుండి ప్రారంభం కానుంది మరియు 18 ఏళ్లు పైబడిన వారు షుగర్ ఉన్నవారు, ధూమపానం చేసేవారు, గత 5 సంవత్సరాలలో టీవీతో బాధపడుతున్నవారు, తక్కువ బి ఎం ఐ ఉన్నవారు మరియు 60 ఏళ్లు పైబడిన వారు కూడా అర్హులని తెలిపారు. ఇది భారతదేశం నుండి టీవీ వ్యాధిని నిర్మూలించడం కోసం ప్రయత్నం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీజీ వ్యాక్సినేషన్ ఇన్చార్జి ఆఫీసర్ డాక్టర్ సతీష్, మండల వైద్యాధికారి రవీందర్, ఆరోగ్య విస్తరణ అధికారి అఖిల్ ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు మండల వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.