జనాభా ప్రతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య
నవతెలంగాణ-చేవెళ్ల
చట్టసభల్లో జనాభా ప్రతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కష్ణయ్య డిమాండ్‌ చేశారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని ఆర్‌ అండ్‌ బి అతిథి గహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. 119 నియోజకవర్గాలలో ఇప్పటివరకు 21 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని దానిని జనాభా ప్రతిపాదికన పెంచాలని అన్నారు. కెసిఆర్‌ 130 కులాలకు లక్ష రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలని అన్నారు. గతంలో 5 లక్షల 70 వేల మంది బీసీ కార్పొరేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. బీసీ బందును వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని అన్నారు. ధరణి ద్వారా ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులను మరిచిపోయి టీచర్‌ పోస్టులను భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్‌ లాల్‌ కష్ణ, బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కష్ణ యాదవ్‌, బీసీ వెల్ఫేర్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పాండు, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌ నర్సింలు, నాయకులు మనోహర్‌, శ్రీకాంత్‌, రాఘవేందర్‌, వంశి గౌడ్‌, ప్రవీణ్‌, శ్రీశైలం, వీరేష్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love