– పోలీస్ కమిషనర్ అనురాధ
– యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే టివీ వితరణ
నవతెలంగాణ – సిద్దిపేట
సోషల్ మీడియా వాడకంలో జాగ్రతలు పాటించాలని, విద్గార్థులకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీస్ ల దృష్టికి తీసుకురావాలని పోలీస్ కమిషనర్ అనురాధ విద్యార్థులకు సూచించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజియన్ ఆఫీస్ ఆధ్వర్యంలో మహిళ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఎంపవర్ హర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాలకు బహుమతిగా టీవీని అందజేశారు. ఈ సందర్భంగా రీజియనల్ హెడ్ వికాస్ మాట్లాడుతూ విదార్థులకి ఎలాంటి బ్యాంకింగ్సేవల అవసరం ఉన్న తమ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ లో సంప్రదించాలని, మహిళల అభివృద్ధికి ఎల్లవేళలా తోడ్పాటు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ సిబ్బంది రాఘవ, సంజయ్ కుమార్, చంద్రిక, యురేఖ, నీతూ, కళాశాల ప్రిన్సిపాల్ స్నేహలత, విద్యార్థులు పాల్గొన్నారు.