తిరుమలలో ఎలుగుబంటి కలకలం

ఎలుగుబంటి కలకలం
ఎలుగుబంటి కలకలం

నవతెలంగాణ తిరుపతి: తిరుమలలోని శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. ఉదయం 2వేల మెట్టు వద్ద భక్తులకు ఎలుగుబంటి కనిపించింది. సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంటి రావడాన్ని గమనించిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు మైక్‌లో అనౌన్స్‌మెంట్‌ ఇచ్చి నడకమార్గంలో వస్తున్న భక్తులను అప్రమత్తం చేశారు. కొంతసేపటికి ఎలుగుబంటి తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. ఇప్పటికే చిరుతపులి సంచారంతోనే నడకమార్గంలో భక్తులు అనేక ఆగచాట్లు పడుతుంటే, తాజాగా ఎలుగుబంటి కనిపించడంతో అందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Spread the love