– తాడి చెట్టు మీది నుండి జారిపడి గాయాలపాలు
నవతెలంగాణ- తాడ్వాయి
మండల పరిధిలోని కాటాపూర్ లో కల్లుగీత కార్మికుడు తేనెటీగల దాడితో తాడిచెట్టు మీద నుండి జారిపడ్డ సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కాటాపూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు సదానందం గౌడ్ కల్లుగీత వృత్తితో జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే శనివారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో తాటి చెట్టు ఎక్కగా తాటికల్లు తేమకు చెట్టు పైన చేరిన తేనెటీగలు సదానందం గౌడ్ తాడిచెట్టు పైకి చేరుకోగానే ఒకసారిగా దాడి చేశాయి. కంగారు పడ్డ సదానందం గౌడ్ తేనెటీగల భారీ నుండి తప్పించుకునే క్రమంలో చెట్టు పైనుంచి జారి కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని పిహెచ్ సి కి తరలించి వైద్యం అందించారు. గీత కార్మికుడు సదానందం గౌడ్ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.