బిచ్చగాడు 3 చేయబోతున్నా..

విజరు ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బిచ్చగాడు2’. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ నగరాల్లోని ‘బిచ్చగాడు2′ థియేటర్స్‌కు వెళ్లి చిత్ర బృందం సందడి చేసింది. అలాగే రాజమండ్రిలో నిజమైన బిచ్చగాళ్లకు ఓ స్టార్‌ హోటల్‌లో విందు ఏర్పాటు చేయటం విశేషం. ఈ సినిమా పెద్ద విజయం సాధించిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత ఫాతిమా విజరు ఆంటోనీ మాట్లాడుతూ,’ ‘దేవుడితో పాటు మీ అందరికీ థ్యాంక్యూ. మీరు లేకపోతే విజరు ఆంటోనీ, ఫాతిమా ఎవరూ లేరు. ప్రేక్షకులతో పాటు ఈ జర్నీలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని చెప్పారు.
‘మీ అందరికీ ‘బిచ్చగాడు’ నచ్చింది. సపోర్ట్‌ చేశారు. ఇప్పుడు ‘బిచ్చగాడు2’ నచ్చింది.. మంచి విజయం ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ సంతోషకరమైన వార్త షేర్‌ చేసుకుంటున్నాను. త్వరలోనే ‘బిచ్చగాడు3′ చేయబోతున్నాను. ఈ మూవీ 2025 లేదా 2026 బిగినింగ్‌లో విడుదలవుతుంది. ఈ విజయం నా ఒక్కడిది కాదు. నా టీమ్‌ మొత్తం సపోర్ట్‌ చేసింది. నా భార్య ఫాతిమా సపోర్ట్‌ మరవలేను. నా అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌, టెక్నికల్‌ టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌ చెబుతున్నాను. ఏ విజయాన్ని మనం ఒక్కరమే ఓన్‌ చేసుకోలేం. ప్రతి విజయంలో భాగస్వాములు ఉంటారు. ఉషాపిక్చర్స్‌ వీరి నాయుడు ప్రతి సందర్భంలో సపోర్ట్‌గా ఉన్నారు. వారితో పాటు సురేష్‌, విజరు బాబు అండగా నిలిచారు. ఈ సక్సెస్‌ మీట్‌ విజయవంతం కావడానికి తోడ్పాటు చేసిన ప్రతి ఒక్కరికీ నా హదయపూర్వ కతజ్ఞతలు’ అని హీరో విజరు ఆంటోనీ చెప్పారు.

Spread the love