అక్టోబర్ 2న మాంసం దుకాణాలు బంద్

నవ తెలంగాణ తాడ్వాయి
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 న అన్ని చికెన్,  మాంసం  దుకాణాలు, చేపల  మార్కెట్ మూసివేయవలసినదిగా కామారెడ్డి మునిసిపల్ కమీషనర్ దేవేందర్ శనివారం ఒక ప్రకటనలో దుకాణదారులకు విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు దుకాణాదారులు తాకీదులు జారీచేశామని, ఉల్లంఘించిన వారిపై చట్టరీత్య తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Spread the love