బేగంపేట వాసికి లవ్లీ విశ్వవిద్యాలయ డాక్టరేట్..

నవతెలంగాణ-బెజ్జంకి 
మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన పొతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి లవ్లీ విశ్వవిద్యాలయం నుండి సోమవారం డాక్టరేట్ పోందారు.అసోసియేట్ ప్రొఫెసర్ మితిలేష్ పాండే, డాక్టర్ శబనం గులాటి పర్యవేక్షణలో రాజశేఖర్ రెడ్డి సోషల్ మీడియా విభాగంలో ‘ఏ స్టడీ ఆన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వర్డ్ ఆఫ్ మౌత్ ఆన్ కస్టమర్ గ్రీన్ పర్చసే ఇంటెన్షన్’అంశంపై పీహెచ్ డీలో పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ పోందారు. పరిశోదన పూర్తి చేయడానికి సహకరించిన లవ్లీ విశ్వవిద్యాలయ ప్రోఫెషర్లకు రాజశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love