బేగంపేట్, శంషాబాద్ ఎయిర్ పోర్టుల్లోనూ విస్తృతంగా తనిఖీలు: సీఎస్

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పోలీసుశాఖ, ఇతర విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బేగంపేట, శంషాబాద్‌ విమానాశ్రయాల్లోనూ తనిఖీలు చేయాలని ఆదేశించారు. స్మగ్లర్లు ఉపయోగించే రహస్య మార్గాలపై నిఘా పెంచాలని అధికారులకు సూచించారు. నగదు అక్రమ రవాణా తదితర అంశాలపై ఇతర రాష్ట్రాల అధికారులతోనూ సమావేశాలు నిర్వహించినట్లు డీజీపీ రవి గుప్తా సీఎస్‌కు తెలియజేశారు. 85 సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఫ్లెయింగ్ స్క్వాడ్‌లు బృందాలను ఏర్పాటు చేశామన్న ఆయన.. గత 15 రోజుల్లో రూ.35 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరోవైపు సరిహద్దు చెక్‌పోస్టుల్లో రూ.5.19 కోట్లు స్వాధీనం చేసుకున్నామని వాణిజ్య పన్నుల కమిషనర్‌ సీఎస్‌కు వివరించారు. పరిశ్రమలు, గోదాములపై నిఘా పెంచాలని ఆమె అధికారులను ఆదేశించారు.

Spread the love