సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు
నవతెలంగాణ – బోనకల్‌
రాష్ట్ర సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ పథకాల లబ్ధిదారులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక తహసిల్దార్‌ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక మండల పరిషత్తు కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాలను అధికారులకు అందజేశారు. తొలుత మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయం నుంచి ప్రదర్శనగా బోసు బొమ్మ సెంటర్‌, స్థానిక ఖమ్మం బస్టాండ్‌ సెంటర్‌ మీదుగా తహసిల్దార్‌ కార్యాలయం వరకు చేరుకున్నారు. అక్కడ అధికార పార్టీ నాయకులకు, మధిర ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు తమ పార్టీలో చేరితేనే దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తన సంతకం లేకుండా దళిత బంధు రాదని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలందరూ అందజేయాలే గాని అధికారం పేరుతో అధికార పార్టీ చెందిన వారికే కట్టబెడితే సహించేది లేదని హెచ్చరించారు. అధికారులు నిష్పక్షపాతంగా అర్హులైన లబ్ధిదారులను గృహలక్ష్మి, బీసీ బం మైనార్టీ బందులకు ఎంపిక చేయాలని డిమాండ్‌ చేశారు. అధికార పార్టీ చెందిన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తే మధిర నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ సంబంధించిందని కేవలం అధికార పార్టీకి సంబంధించిన కాదని అధికార పార్టీ నాయకులు తమ వైఖరి మార్చుకొని అర్హులైన వారిని సంక్షేమ పథకాలకు ఎంపిక చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారులు అధికార పార్టీ నాయకులకు తలవొగ్గి లబ్ధిదారులను ఎంపిక చేయకుండా గ్రామ సభల ద్వారానే ఎంపిక చేయటం ద్వారా అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. గ్రామాలలో అప్పుడే గహలక్ష్మి లబ్ధిదారుల లిస్టులో అధికార పార్టీ నాయకులను చేతులలో హల్‌ చల్‌ చేస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు ఎంపీపీ కంకణాల సౌభాగ్యం సిపిఎం మండల కమిటీ సభ్యులు నోముల పుల్లయ్య, ఏడునూతల లక్ష్మణరావు, కిలారు సురేష్‌, గూగులోతు పంతు, తెల్లాకుల శ్రీనివాసరావు, బంధం శ్రీనివాసరావు, జొన్నలగడ్డ సునీత, కొమ్మినేని నాగేశ్వరరావు, కళ్యాణపు శ్రీనివాసరావు, మాదినేని వీరభద్రరావు, కూచిపూడి మురళి, పిల్లలమర్రి వెంకట అప్పారావు, దొప్ప కొరివి వీరభద్రం, వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో సిపిఎం కార్యకర్తలు, శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.
కొత్తరేషన్‌కార్డులు మంజూరు చేయాలి
తల్లాడ : నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, కొత్త రేషన్‌కార్డులు మంజూరుచేయాలని, అర్హులందరికీ గృహలక్ష్మి పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల ఇంచార్జ్‌ మాదినేని రమేష్‌ మాట్లాడుతూ 2014 నుండి ఇప్పటివరకు నిత్యావసర ధరలు 200 శాతం పెరిగాయన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదారులకు రాయితీలుగా సామాన్యులకు భారాలుగా మారాయి అన్నారు. సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు తాతా భాస్కర్‌రావు మాట్లాడుతూ గృహలక్ష్మి, దళితబంధు పథకాలు అధికార పార్టీ నాయకులకు ఆదాయ వనరులుగా మలచుకుంటున్నారని ఆరోపించారు. అనంతరం పలు సమస్యలు పరిష్కరించాలని తహశీల్దార్‌ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వరరావు, శీలం సత్యనారాయణరెడ్డి, సేలం పకీరమ్మ, నల్లమోతు మోహన్‌రావు, పులి వెంకట నరసయ్య, షేక్‌ మస్తాన్‌, నన్నే సాహెబ్‌, చల్లా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love