ఆముదం నూనెతో ప్రయోజనాలు

బేబీ ఆయిల్స్‌ అంటూ మార్కెట్లోకి ఏవేవో కొత్త ప్రొడక్ట్సు వస్తున్నాయి. కానీ ఇదివరకు చంటి పిల్లల ఆరోగ్యం కోసం అందరూ ఆముదం వాడేవారు. చక్కగా బిడ్డకు ఆముదం నూనెతో మసాజ్‌ చేసి తలకు ఆముదం రాసి స్నానం చేయించేవారు. దాంతో పిల్లలు ఆరోగ్యంగా వుండేవారు. ఆముదం నూనెతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ నూనెకి బ్యాక్టీరియాను చంపే గుణం ఉంటుంది. లేత పసుపు రంగులో ఉండే ఆముదం విరేచనకారి. ఇది లూబ్రికెంట్‌గా నూనెతో కూడిన ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతుంది. నులి పురుగులు, మలబద్ధకం నివారణ కోసం పాతతరం పెద్దవారు బాగా వాడేవారు. ఆముదంతో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు, అరికాటి మంటలు తగ్గుతాయి. ఎండ వల్ల కమిలిన చర్మం సాధారణ స్థితికి తెచ్చేందుకు ఆముదం రాయాలి. చర్మం మీద ఈ నూనెని రాస్తే ముడతలు తగ్గుతాయి. ఆముదంలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు వుంటాయి. ఆముదం నూనెను తలకి పట్టించి మర్దనా చేసిన తర్వాత తలంటుకుంటే జుట్టు పెరుగుదలకే కాదు, శిరోజాలు మృదువుగా కూడా వుంటాయి.

Spread the love