ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారం

నవతెలంగాణ – రెవల్లి: వనపర్తి జిల్లా రేవల్లి మండలం మంగళవారం రోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో అలాగే మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎన్నిక చేసి అవార్డులు ఇవ్వడం జరిగింది. రేవల్లి మండల కేంద్రంలో భాగంగా పి. ప్రసాద్ హెడ్మాస్టర్ జడ్.పి.హెచ్.ఎస్ రేవల్లి గారికి వనపర్తి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు వచ్చినది. అదేవిధంగా మన రేవల్లి మండలంలోని తలపనూరు గ్రామంలో జడ్పిహెచ్ఎస్  హెడ్మాస్టర్ ఆయేషా జబిన్ గారికి మరియు  కొంకలపల్లి గ్రామం హెడ్మాస్టర్ రాజు గౌడ్ గారికి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు శ్రీ నిరంజన్ రెడ్డి గారు, జెడ్పి చైర్మన్ లోకనాథ్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ గారు, మన జిల్లా కలెక్టర్ శ్రీ  తేజస్ నందు లాల్ పవర్ గారు, జిల్లా విద్యాధికారి శ్రీ గోవిందు రాజులు గార్ల చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకోవడం జరిగినది. ఈ విధంగా జిల్లా స్థాయిలో తమ యొక్క హెడ్మాస్టర్లకు అవార్డు రావడంతో తమ తమ తోటి పాఠశాలల ఉపాధ్యాయులు అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
Spread the love