– మంత్రి హరీష్ రావు, సినీ నటుడు సుమన్ అభినందన
నవతెలంగాణ-వీణవంక
మండలంలోని ఎల్బాక గ్రామానికి చెందిన వీణవంక పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి కుమార్తె నారాయణి రెడ్డికి రాష్ట్ర స్థాయి ఉత్తమ వైద్య విద్యార్థి అవార్డు అందుకుంది. ఈ అవార్డును డాక్టర్స్ డే సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా మావురపు నారాయణి రెడ్డిని మంత్రి హరీష్ రావుతో పాటు సినీ నటుడు సుమన్ అభినందించారు. ఉన్నత చదువులు చదివి పేదలకు వైద్య సేవలు అందించాలని వారు సూచించారు.