నవతెలంగాణ – తాడ్వాయి
రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ములుగు జిల్లా బాల, బాలికలకు రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించడం కొరకు శనివారం ములుగు జిల్లా ఎస్పీ శబరిస్ అధ్యక్షతన, స్థానిక మంత్రి సీతక్క చేతుల మీదుగా 2k రన్ పోటీలు నిర్వహించారు. అందులో తాడ్వాయి మండలానికి చెందిన బాల బాలికలు, బాలికల, బాలుర విభాగాలలో ఉత్తమ ప్రతిభలను కనబరిచారు. బాలికల విభాగంలో తాడ్వాయి మండలంలోని వెంగళాపూర్ గ్రామానికి చెందిన తెల్లం ప్రియాంక, బాలుర విభాగంలో తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన కుర్సం రవి, అనే ఇద్దరు ప్రథమ స్థానాలలో గెలిచి, ఉత్తమ ప్రతిభ కనపరిచారు. వీరికి ఒక్కొక్కరికి 7000 రూపాయల చొప్పున మొత్తం ఇద్దరికీ కలిపి 14000 రూపాయల నగదు బహుమతిగా అందజేశారు. కాగా అదే కాల్వపెళ్లి గ్రామానికి చెందిన మడకం భీమయ్య ను మంత్రి సీతక్క చేతుల మీదగా స్పెషల్ బహుమతిని పొందారు. ఈ సందర్భంగా పస్రా సిఐ రవీందర్, తాడ్వాయి స్థానిక ఎస్సై ననిగంటి శ్రీకాంత్ రెడ్డిలు, మండల అధికారులు, ఆదివాసి సంఘాల నేతలు, మండల నాయకులు, ప్రశంసించారు.