నవతెలంగాణ- హైదాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డికి సినీ నిర్మాత బండ్ల గణేశ్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైన మా నాయకుడు, నిరంతరం నా శ్రేయస్సును కోరుకునే మా అన్న ఎనుముల రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. ‘నాడు బూర్గుల (1952), నేడు ఎనుముల( 2023)… పాలమూరు నుండి ముఖ్యమంత్రులు’ అంటూ మరో ట్వీట్ చేశారు.
రేవంత్ రెడ్డికి సిద్ధరామయ్య శుభాకాంక్షలు.. బండ్ల గణేశ్ రీట్వీట్
కాంగ్రెస్ శాసన సభా పక్ష సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రేవంత్ రెడ్డి పాలనలో అందరినీ కలుపుకొని పోయి, ప్రగతిశీల, పారదర్శక పాలన అందిస్తారని నాకు నమ్మకం ఉందంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. దీనిని బండ్ల గణేశ్ రీట్వీట్ చేశారు.