– ఈ ఏడాది నుంచి రాగి, జావా, వర్క్ పుస్తకాలు, నోటు పుస్తకాలు విద్యార్థుల అభివృద్ధి కోసం సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించి ప్రతి నెలా మూడవ శనివారం పేరెంట్-టీచర్ సమావేశాలు వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి జి. రేణుకాదేవి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
‘ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య అందుతోంది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దీంతో కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి వాటి బలోపేతానికి కృషి చేస్తోంది. పెద్దమొత్తంలో నిధులు కేటా యించింది. పాఠశాలల్లో అదనపు గదులు, మౌలిక వసతులు కల్పిస్తోంది. దీంతో పాఠశాలలు కొత్త శోభను సంతరించు కున్నాయి. దీనికి నిదర్శనమే ఈ యేడు ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన అడ్మిషన్లు.’ వికారాబాద్ జిల్లా విద్యాధికారి రేణుక దేవి తెలిపారు. ఈ ఏడాది నుంచి విద్యార్థులకు రాగి, జావా, వర్క్ పుస్తకాలు, నోటు పుస్తకాలు అందజేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థుల అభివృద్ధి కోసం సమాజ భాగస్వామ్యాన్ని పెంపొం దించి, ప్రతి నెలా మూడవ శనివారం పేరెంట్- టీచర్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఎడ్యూకేషన్ స్పెషల్ ప్రత్యేక సంచిక సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి జి. రేణుక దేవి నవతెలంగాణతో మాట్లాడారు.
జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. ఎంత మంది విద్యార్థులు ఉన్నారు. ?
జిల్లాలో మొత్తం 1,314 పాఠశాలలున్నాయి. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 1102 ప్రభుత్వ పాఠశాలలు 184 ప్ర యివేటు పాఠశాలలు కొనసాగుతున్నాయి. 28 పాఠశాలలు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. జిల్లాలో మొత్తం 92,639 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్నా రు. 54,939 మంది విద్యార్థులు ప్రభుత్వ సంక్షేమ పాఠశాల, ప్రయివేటు పాఠశాల్లో చదువుతున్నారు. 3,954 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు,1924 మంది ప్రయివేటు ఉపాధ్యాయులు పాఠశాలలో బోధిస్తున్నారు.
‘మన ఊరు-మన బడి’ జిల్లాలో ఎన్ని పాఠశాలలు ఎంపికయ్యాయి.?
జిల్లాలో 371 పాఠశాలలు మొదటి దశలో ఎంపికయ్యా యి. 371 పాఠశాలలో సకల వసతులు కల్పించటం కోసం 144.84 లక్షల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 53,084 మంది విద్యార్థులు లబ్ది పొందుతున్నా రు. మధ్యాహ్న భోజనం పథకం 1102 ప్రభుత్వ పాఠశాలలో అమలు జరుగుతుందని, ఇందులో 92,639 విద్యార్థులు లబ్ది పొందుతున్నారు. 1646 మంది వంట కార్మికులు పనిచేస్తున్నారు.
విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ?
ఈ విద్యా సంవత్సరం నుండి 1102 పాఠశాలలోని ఒకటవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు ఉద యం పూట రాగిజావ అందించే కార్యక్రమాన్ని ప్రారంభిం చాం. దీని ద్వారా 92,639 విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అభ్యసన సామర్ధ్యాలు పెంచడం కోసం వర్క్ బుక్‌లను ఉచితంగా అందిస్తున్నాం. మొత్తం 42,459 మంది విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
డిజిటల్ విద్య కోసం ఏ విధంగా కృషి చేస్తున్నారు?
112 ఉన్నత పాఠశాలలో 8, 9, 10వ తరగతిలో ఐఎఫ్సి ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్‌ను ప్రారంభించాం. దీని ద్వారా మారుతున్న పరిస్థితులు అనుగుణంగా విద్యార్థులకు వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు. ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లోని సమస్త సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయడానికి 790 పాఠశాలలకు గాను 823 ట్యాబ్స్ అందించాం. తొలిమెట్టు కార్యక్రమం ద్వారా గత సంవత్సరం నుంచి ప్రాథమిక పాఠశాలలోని ఒకటో తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు తరగతుల సామార్థ్యాలను అభ్యసన ఫలితా లను సాధించడానికి తొలిమెట్టు ప్రారంభించాం. జిల్లాలోని 2161 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చాం. 42,896 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం.
ఆంగ్ల మద్యమంలో విద్య బోధన ఎలా ఉంది?
పేద బడుగు పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదవాలని 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం. తొమ్మిదో తరగతి వరకు విస్తరించి 6, 28,452 పాఠ్యపుస్తకాలను ద్వి భాషలో విద్యార్థులకు అందించాం. 28 గురుకులాలు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 9 ఆదర్శ పాటలు కొనసాగు తున్నాయి, ఇందులో ఆరు నుండి 12వ తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యుత్ తో పాటు వృత్తి విద్య కోర్సులను అందిస్తున్నాం.
బాలికల విద్య కోసం ఏ విధంగా కృషి చేస్తున్నారు?
జిల్లాలో 18 కేజీబీవీలు బాలికల విద్య కోసం ఏర్పాటు చేసాం. ఇందులో తొమ్మిది కేజీబీలలో ఇంటర్మీడియట్ వరకు విద్యను అందిస్తున్నాం. 4, 954 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు చదవడం అలవాటు చేయడానికి 154 పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేశాం. విద్యార్థులు యునిఫాంలు అందజేసినట్టు తెలిపారు.
సైబర్ నేరాలపై అవగాహన కలిగిస్తున్నారా..?
ఆన్‌లైన్ నేరాల నివారణకు అవగాహన కల్పించుట కోసం జిల్లాలోని 52 పాఠశాలలో 104 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారిని సైబర్ అంబాసిడార్లుగా గుర్తిస్తూ మిగతా విద్యార్థులకు, తల్లిదండ్రులకు సమాజంపై అవగాహన కల్పిస్తున్నాం. 8వ అంతర్జాతీయ విద్య వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించాం. జిల్లాలో మాస్టర్ డి.అశోక్ జడ్పీహెచ్‌ఎస్ పసల్‌వాడ్, దౌల్తాబాద్ మండలం నుంచి జాతీయస్థాయిలో విజేత. అంతర్జాతీయ స్థాయిలో కాంబోడియా దేశంలో జరిగిన అంతర్జాతీయ ప్రదర్శనలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా మన జిల్లాకు ప్రత్యేకమైన స్థానం లభించింది. అందరూ గర్వపడే విధంగా కృషి చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుంది కాబట్టి తల్లీదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి.