ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య..

నవతెలంగాణ – హలియా
ప్రభుత్వ పాఠశాలలు గుణాత్మకమైన ఒత్తిడి లేని విద్యను అందించగలవని ఇబ్రహీంపేట  ప్రాథమికొన్నత  పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగీత రావు  అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం  గ్రామంలో ఉపాధ్యాయులతో కలిసి ఇల్లిల్లు తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్య కోసం కల్పిస్తున్న సదుపాయాలను గురించి తెలుపుతూ విద్యార్థులను పాఠశాలలో చేయవలసిందిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల ఉపాధ్యాయులు  ఓ సరిత, ఎన్ సరిత, మహేశ్వరీ, జమీల, దయాకర్, శంకరాచారి  పాల్గొన్నారు.
Spread the love