మెరుగైన విద్యతోపాటు మంచి ఆహారం అందివ్వాలి

మండల విద్యాధికారి విద్యాసాగర్‌
నవతెలంగాణ-మర్పల్లి
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలని మండల విద్యాధికారి విద్యాసాగర్‌ ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని రావులపల్లి, కల్కోడ, గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన గురువారం పరిశీలించారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుతూ మెరుగైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలని ఎంఈఓ సూచించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు, సీఆర్‌పీలు ఉన్నారు.

Spread the love