సైబర్‌ కరెంట్‌ నేరగాళ్ళతో జాగ్రత్త

– వినియోగదారులకు టీస్‌ఎన్పీడీసీఎల్‌ సీఎమ్‌డీ ఏ గోపాలరావు హెచ్చరిక
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
”మీ ఇంటి కరెంటు బిల్లు ఇంకా కట్టలేదు. బిల్లు పెండింగ్‌లో ఉన్నందున కరెంట్‌ కట్‌ చేస్తున్నాం. తక్షణం ఈ క్రింది నెంబర్‌కు ఫోన్‌ చెయ్యండి” అని సైబర్‌ నేరగాళ్లు విద్యుత్‌ వినియోగదారులకు పంపే మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) సీఎమ్‌డీ ఏ గోపాలరావు హెచ్చరించారు. ఈ తరహా మోసాలు తమ దృష్టికి వచ్చాయనీ, ఆ మెసేజ్‌లకు, తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ సంస్థ ఈ తరహా మెసేజ్‌లు ఎప్పుడు పంపదని స్పష్టం చేశారు. సైబర్‌ నేరగాళ్లు పంపే మెసేజ్‌లు ఓపెన్‌ చెయ్యకూడదని, అందులో ఉన్న ఫోన్‌ నెంబర్లకు కాల్స్‌ చేయోద్దని సూచించారు. విద్యుత్‌ వినియోగదారులు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ షషష.్‌రఅజూసషశ్రీ.ఱఅ లో బిల్‌ డెస్క్‌ ద్వారా సర్వీస్‌ నెంబరు నిర్ధారించుకొని బిల్లులు చెల్లించాలని కోరారు. గూగుల్‌ పే, ఫోన్‌ పే ద్వారా కూడా బిల్లులు చెల్లించవచ్చని తెలిపారు. సైబర్‌ నేరగాళ్ల నుంచి ఏవైనా తప్పుడు మెసేజ్‌లు వస్తే సంబంధిత పోలిస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Spread the love