నవతెలంగాణ హైదరాబాద్: భగత్ సింగ్ జన్ అధికార్ యాత్ర (BSJAY) హైదరబాద్ లో ఇందిరా పార్క్, అశోక్ నగర్, గాంధీనగర్, చిక్కడపల్లి, సుందరయ్య పార్క్ వరకు సాగింది. దేశ వ్యాప్తంగా ఉన్నత చదువులు చదుతున్న యూవత 13 రాష్ట్రాల మీదుగా 8500 కి.మీ. ప్రయాణించి నేడు హైదారాబాద్ చేరుకుంది. భగత్ సింగ్ సందేశాన్ని వారు ప్రచారం చేస్తూ ఈ యాత్రను వారు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి, మతోన్మాదం, సామాన్యులు ఎదుర్కొంటున్న దోపిడీకి వ్యతిరేకంగా, ఉద్యోగాలు, విద్య, వైద్యసదుపాయాలు, నివాసం కోసం ఉద్యమిద్దాం అంటూ మధ్య మధ్యలో స్ట్రీట్ మీటింగ్స్ పెడుతూ సందేశం ఇచ్చారు. ప్రజలకు విస్తృతంగా కరపత్రాలు, పుస్తకాలు పంచుతూ ముందుకు సాగారు.
బీజేపీ రామరాజ్యంలో ఆకాశాన్నంటుతున్న అవినీతి అనే 20పేజిల బుక్ లెట్ ను వారు ఈ సందర్భంగా అందరికి పంచుతూ, వారి ఉద్దేశాన్ని స్పష్టంగా చెబుతున్నారు.