
నవతెలంగాణ – కంఠేశ్వర్
భగత్ సింగ్ స్ఫూర్తితో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నాందేవ్వాడలోని ఎస్ఎఫ్ఐ ఆఫీసు నుండి అర్సపల్లి భగత్ సింగ్ స్టాచు మీదుగా దేవి రోడ్డు భగత్ సింగ్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అదే విధంగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ బైక్ ర్యాలీనిఉద్ధేశించి మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ.. భగత్ సింగ్ మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడిన మహానీయుడని కొనియాడారు. తన 23 ఏళ్ల ప్రాయంలో ఈ దేశం కోసం ఉరికాంబాన్ని ముద్దాడి బ్రిటీషర్ల నుండి స్వాతంత్రాన్ని అందించిన వీరుని గాధ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సూచించారు. అదేవిధంగా భగత్ సింగ్ చరిత్రను పాఠ్యాంశంగా బోధించాలని ఆయన అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ భగత్ సింగ్ త్యాగం, సుఖ్దేవ్ స్నేహం, రాజ్ గురు ధీరత్వాన్ని పునికి పుచ్చుకొని వారి ఆశయాలను కొనసాగించాలని సూచించారు. భగత్ సింగ్ రవి అస్తమించని సామ్రాజ్యవాదాన్ని తరిమికొట్టి ఈ దేశానికి స్వాతంత్రం అందించాడని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ పేరుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించలని అన్నారు. మరియు దేశవ్యాప్తంగా భగత్ సింగ్ పేరు తో విశ్వవిద్యాలయలను ఏర్పాటుకు ప్రభుత్వాలను కృషి చేయాలని అన్నారు. భగత్ సింగ్ ఆశయాలను సాధించడం అంటే ఈ దేశం మతతత్వ పోకడల నుండి విప్లవ పోరాటాలకు చేయాలని అన్నారు. మరియు భగత్ సింగ్ పోరాట పట్టిమతో నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక, జిల్లా ఉపాధ్యక్షులు దినేష్, నగర కార్యదర్శి చక్రి, జిల్లా నాయకులు రాజు, కిరణ్, వివేక్, సుశాంత్, రాము, రమేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత,పిఎన్ఎమ్ జిల్లా కార్యదర్శి సిర్ప లింగం తదితరులు పాల్గొన్నారు.