భలే.. వెడ్డింగ్‌ సాంగ్‌

భలే.. వెడ్డింగ్‌ సాంగ్‌జీవీ ప్రకాష్‌ కుమార్‌, ఐశ్వర్య రాజేష్‌ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘డియర్‌’. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నట్‌మెగ్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర పై వరుణ్‌ త్రిపురనేని, అభిషేక్‌ రామిశెట్టి, జి పథ్వీరాజ్‌ నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకు ఒక్కరోజు గ్యాప్‌ ఉంటుంది. తమిళ వెర్షన్‌ ఈనెల 11న విడుదల కానుండగా, తెలుగు వెర్షన్‌ ఈనెల 12న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘భలే వెడ్డింగ్‌’ పాటని విడుదల చేశారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌ కూడా అందిస్తున్న జీవీ ప్రకాష్‌ కుమార్‌ ఈ పాటని పుట్‌ ట్యాపింగ్‌ వెడ్డింగ్‌ నెంబర్‌గా కంపోజ్‌ చేశారు. రాకేందు మౌళి లిరిక్స్‌ అందించిన ఈ పాటని నారాయణన్‌ రవిశంకర్‌, సిందూరి విశాల్‌ గ్రేస్‌ ఫుల్‌గా ఆలపించారు. ఈ పాటలో జివి ప్రకాష్‌ కుమార్‌, ఐశ్వర్య రాజేష్‌ కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంది. ఈ వెడ్డింగ్‌ నెంబర్‌లో వారి డ్యాన్స్‌ మూమెంట్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా ఆంధ్రా థియేట్రికల్‌ హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్‌ కొనుగోలు చేయగా, ఏషియన్‌ సినిమాస్‌ తెలంగాణ థియేట్రికల్‌ హక్కులను సొంతం చేసుకుంది. హ్యూజ్‌ థియేట్రికల్‌ చైన్‌ బిజినెస్లు ఉన్న ప్రొడక్షన్‌ , డిస్ట్రిబ్యూషన్‌ సంస్థల బ్యాకింగ్‌ తో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రాండ్‌ గా విడుదల కానుంది.

Spread the love