భారత దేశ సర్వతోముఖాభివృద్ది, భారతీయుల శ్రేయస్సు తో పాటూ భాగ్యనగర ప్రజల హితం కాంక్షిస్తూ ఈనెల15 ఆక్టోబర్ నుండి 27 నవంబర్ వరకు 45 రోజుల పాటూ మహా యజ్ఞాన్ని నిర్వహించాలని లతామా ఫౌండేషన్ నిర్ణయించింది. ఈ మహాయజ్ఞాన్ని ఆశ్వయుజ శుద్ద పాడ్యమి అనగా 15 అక్టోబర్ నుండి కార్తిక పౌర్ణమి అయిన 27 నవంబర్ వరకూ నిర్వహించనున్నారు. భాగ్యనగరంలోని అత్యంత పురాతన ఆలయాలలో ఒకటిగా పేరు గడించిన సీతారాం భాగ్ శ్రీరామ దేవ స్థాన ప్రాంగణంలో నిర్వహించబడే ఈ మహా యజ్ఞానికి భారత భాగ్య సమృద్ది యజ్ఞం పేరుతో జరుపబడుతుంది. నేటి నుండి ప్రారంభం కానున్న ఈ మహా యజ్ఞానికి లతామ్మ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ మాథవి లత మాట్లాడుతూ పలు హిందూ ధార్మిక సంస్థలతో కలసి భాగ్యనగరంలో హిందువుల హితం కోరుతూ ఈ యజ్ఞం నిర్వహిస్తున్నామని తెలిపారు. వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ భారత భాగ్య సమృద్ది యజ్ఞం లో ప్రధానంగా 45 రోజుల పాటూ సర్వ కార్యసిద్ది సహస్ర చంఢీసహిత మహా రుద్ర కామేశ్వర కామేశ్వరి యాగం జరుగుతుందని చెప్పారు. ఇలా సమాజ మంచి కోరుతూ నిర్వహించబడే ఈ యజ్ఞంలో ప్రతి కుటుంభ శ్రేయస్సు, భాగ్య సమృద్ది వారి జీవితంలోని పలు సమస్యల నివారణ కోసం వైదిక ధర్మంలో పేర్కొనబడిన 36 రకాల వైదిక విధులు, 12 రకములైన కళ్యాణాలతో పాటూ పలు విధములైన హామాలు కూడా చేయించబడతాయిని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని రేపటి నుండి భాగ్యనగరంలోని పలు ప్రాంతాలలో నిర్వహించనున్నామని వివరించారు. ఈ సందర్భంగా భారత భాగ్య సమృద్ది అన్ని పేరు యజ్ఞానికి పెట్టడానికి గల కారణాలు వివరిస్తూ దేశమంటే మట్టి కాదోయ్ మనుష్యులని ఒక మహాకవి అన్నట్లు భారతీయులందరూ సమృద్ది సాధిస్తే తప్ప దేశ సమృద్ది సాధించలేమని అంటూ ఈ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశ్యం దేశ సమృద్ది తో పాటూ దేశ పౌరులందరి సమృద్ది కాంక్షించడం అని అన్నారు. అందుకే ప్రజల హితం కోరుతూ ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఈ యజ్ఞస్థలంలోనిర్వహంచబడుతాయని తద్వారా ప్రజలకు మేలు చేకూరుతుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. భారత దేశ అభివృద్దితో పాటూ దేశ ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ నిర్వహించతలపెట్టిన ఈ యజ్ఞంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మేనేజింగ్ ట్రస్టీ లతామా ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ మాథవి లత, శ్రీ యమన్ సింగ్, పూర్వ రాష్ట్ర అధ్యక్షులు, భజరంగదళ్, సంయుక్త ఆంద్ర ప్రదేశ్, శ్రీ ఆర్ యల్ యన్ రావు, నిర్వాహకులు, లతామా ఫౌండేషన్ పాల్గొన్నారు.