తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు తీగల భరత్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో బీజేవైఎం మండల అధ్యక్షులు గాజా శ్యాంసుందర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపై స్థానిక తాసిల్దార్ సదానందం గారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్ళు,నిధులు, నియామకాలు అంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు నియామకాల విషయంలో నిరుద్యోగులు మోసానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపించినట్లుగానే,కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంథాలో నడుస్తూ హామీలను నెరవేర్చకుండా నిరుద్యోగ యువతీ యువకులని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మోసాలను ఎండగడుతూ తెలంగాణ యువత తరపున,నిరుద్యోగుల తరపున బీజేవైఎం నిరంతరం పోరాటాలు చేస్తూ వస్తుందన్నారు.ఆయినప్పటికీ ఈ నియంతృత్వ ప్రభుత్వం కనీస స్పందన లేకుండా కాలం గడిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఈ నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళలని ఆరోపించారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలని,గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని,25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని వెంటనే నిర్వహించాలని అన్నారు. ప్రస్తుత డీఎస్సీ పరీక్ష తేదీలను పోస్ట్ ఫోన్ చేసి నూతన తేదీలను ప్రకటించాలని,అన్ని నియామకాల్లో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ కేటాయించాలని,పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలని,జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిజెపి ఓబీసీ ఉపాద్యక్షుడు గాజ వెంకటేష్, నాయకులు ఏరుకొండ సాంబరాజు,రాజేందర్,రాచర్ల సాంబరాజు,శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.