నవతెలంగాణ – తాడ్వాయి
మండల కేంద్రానికి చెందిన భర్తపురం నరేష్ బీజేపీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శిగా భర్తపురం నరేష్.. ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భర్తపురం నరేష్ క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, గతంలో బీజేపీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శిగా భర్తపురం నరేష్.. మండల అధ్యక్షునిగా విధులు నిర్వహించారు. అంతేకాకుండా ఉమ్మడి భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని క్రియాశీలకంగా పనిచేస్తున్న నరేష్ కు మలుగు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరో సారి బాధ్యతలు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం అప్పగించారు. నూతనంగా ఎన్నికైన బీజేపీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శిగా భర్తపురం నరేష్.. ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి భర్తపురం నరేష్ మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో నాకు జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతగా అప్పగించిన జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం, అలాగే బీజేపీ జిల్లా మండల నాయకులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల్లో నిత్యం ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా నిరంతరం కృషి చేస్తానని అన్నారు.