ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతాం: భట్టి

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాదయాత్రను ఆదిలాబాద్ లో ప్రారంభించిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదిలాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు ఏఐసీసీ ఆధేశించిందని గుర్తు చేశారు. నాడు పాదయాత్రకు ఆదిలాబాద్ నుంచే నాంది పలికామని చెప్పుకొచ్చారు. ప్రజల ఎజెండాతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెల్తోందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు కాబట్టే ఇందిరమ్మ రాజ్యం సాధ్యమైందని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ప్రజల కోసమే పని చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన అధికారాన్ని తమ బాధ్యతగా నిర్వర్తిస్తున్నాం అని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేశామని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని భట్టి భరోసా ఇచ్చారు.

Spread the love