ప్రపంచ డెఫ్‌ టెన్నిస్‌ టోర్నీకి భవాని

హైదరాబాద్‌ : ప్రతిష్ఠాత్మక ప్రపంచ డెఫ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌నకు రాష్ట్రానికి చెందిన యువ క్రీడాకారిణి భవాని కేడియా ఎంపికైంది. గ్రీసులోని హెర్సోనిసోస్‌ వేదికగా సెప్టెంబర్‌ 23-29న జరిగే మెగా టోర్నీ కోసం త్రివేడ్రంలో నిర్వహించిన జాతీయ సెలక్షన్స్‌ ట్రయల్స్‌లో భవాని సత్తాచాటింది. మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో 6-4, 6-4తో క్రితి లాటాపై భవాని అద్భుత విజయం సాధించింది. గతేడాది బ్రెజిల్‌ డెఫ్‌ ఒలింపిక్స్‌లో డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భవాని ఈసారి కచ్చితంగా పతకం గెెలుస్తానని విశ్వాసం వెలిబుచ్చింది. టెన్నిస్‌లో నిలకడగా రాణిస్తున్న భవాని..సెయింట్‌ ఆన్స్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది.
ఎంపికైన క్రీడాకారులు : పథ్వీ శేఖర్‌, ధనంజయ దూబే, శివాజీ, అర్షిత్‌, జాఫ్రిన్‌ షేక్‌, భవానీ కేడియా

Spread the love