భిక్కనూర్ లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు మండల బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి ఆదివారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారులు, మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే సొసైటీ చైర్మన్ భూమయ్య, జంగంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ నర్సింలు యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టి పి సి సి రాష్ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, ఎంపీపీ గాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, ఎన్నారై సెల్ జిల్లా కన్వీనర్ సుధాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love