నవతెలంగాణ – వేల్పూర్ : వేల్పూర్ మండల కేంద్రం మంత్రి క్యాంప్ ఆఫీసులో కెసిఆర్ జనారంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై భీంగల్ మండలం గోనుగొప్పుల గ్రామానికి చెందిన మండల బీజేపీ ఎస్టీ సెల్ కోశాధికారి దరావత్ రవీందర్ నాయక్ ఆయన అనుచరులు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు.