మాస్‌ బీట్‌తో భోళా మానియా

    చిరంజీవి, మెహర్‌ రమేష్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘భోళా శంకర్‌’. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.తాజాగా మేకర్స్‌ మ్యూజికల్‌ జర్నీని బ్లాక్‌ బస్టర్‌ నోట్‌తో ప్రారంభించారు. లేటెస్ట్‌గా విడుదలైన మొదటి పాట ‘భోళా మానియా’ మాస్‌ని ఆకట్టుకునే బీట్‌లతో హైలీ ఎనర్జిటిక్‌ నెంబర్‌. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను మహతి స్వర సాగర్‌ ఆకట్టుకునేలా స్వరపరిచారు. రేవంత్‌ ఎల్వీ పాటని ఎనర్జిటిక్‌గా ఆలపించారు. చిరంజీవి గ్రేస్‌ ఫుల్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ కన్నుల పండుగలా ఉన్నాయి. ఈ పాటలో చిరంజీవి స్టైలిష్‌గా, యంగ్‌గా కనిపించారు. చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల ఈ చిత్రానికి స్టైలింగ్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేస్తున్నారు. అనిల్‌ సుంకర (ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌) నిర్మిస్తున్న ఈ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లో భావోద్వేగాలు, ఇతర అంశాలు సమపాళ్లలో ఉండబోతున్నాయి. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, చిరంజీవి సిస్టర్‌గా కీర్తిసురేష్‌ కనిపించనుంది. సుశాంత్‌ ఈ సినిమాలో లవర్‌ బాయ్‌ పాత్రను పోషించారు. ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి డీవోపీ: డడ్లీ, ఎడిటర్‌: మార్తాండ్‌ కె వెంకటేష్‌.

Spread the love