పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి భూమి పూజ

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆరిలోవలో ప్రభుత్వం కేటాయించిన భూమిలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి కుటుంబసభ్యులతో కలిసి పీవీ సింధు భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఏడాదిలోపు అకాడమీ నిర్మాణం చేస్తామని తెలిపారు. విశాఖలోని యువతకు బ్యాడ్మింటన్ నేర్చుకునే సామర్థ్యం ఎక్కువని చెప్పారు. అకాడమీకి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని, దీని ద్వారా ఎంతోమంది క్రీడాకారులు పథకాలు సాధించేలాగా చేస్తామని పేర్కొన్నారు.

Spread the love