నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణములోని రెండవ వార్డు పరిధిలో గల వడ్డెర కాలొనీ వద్ద ప్రజా ఆశీర్వాద కార్యక్రమములో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంజూరు చేసిన 25 లక్షల నిధుల తో నిర్మించతలపెట్టిన వడ్డెర సంఘం భవనం భూమి పూజ కార్యక్రమం బుధవారం నిర్వహించినారు. .ముఖ్య అథితులుగా PUC చైర్మన్, భారాస జిల్లా రథ సారథి, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి విచ్చేసి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమములో జీవన్ రెడ్డి మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. వడ్డెర కుల సంఘం కు ఇంకా 25 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చి, సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. వార్డులో సమస్యల పరిష్కరానికి అభివృద్ధి నిధులు మంజూరు చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా వడ్డెర కులస్తులు అందరూ ఎమ్మెల్యే కు కృతఙ్ఞతలు తెలిపి రాబోయే ఎన్నికల్లో జీవన్ రెడ్డి కు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ, జీవన్ రెడ్డి వెంటే వుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నా భాయ్, పట్టణ తెరాస అధ్యక్షులు పూజ నరేందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లింగా గౌడ్ తెరాస నాయకులు ఖాందేష్ శ్రీనివాస్, నీరడి రాజా మున్సిపల్ కౌన్సిలర్లు సంగీతా ఖాందేష్, వనం శేఖర్, ఫయాజ్, ఇంతియాజ్, అతిక్, అబ్దుల్ రెహమాన్ తెరాస నాయకులు ఖాందేష్ సత్యం, మక్కల సాయినాథ్, మక్కల సంతోష్, బుచ్చిరాజు, రాజశేఖర్ వడ్డెర సంఘం పెద్దలు మాగిని ఎల్లయ్య, మక్కల ఎల్లయ్య, ఎల్లయ్య, సాయిలు, శ్రీను, దండుగుల వెంకటి, బాజన్న మరియు సభ్యులు, సరస్వతి మహిళా సమాఖ్య అధ్యక్షులు గోదావరి, సభ్యులు, , ఆర్ పి మమత కాలనీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.