మంత్రి ఆదేశాలతో వాటర్ ట్యాంకు భూమి పూజ

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్ గ్రామంలో వడ్డెర కాలనీలో నీటి సమస్య కోసం వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు శనివారం వడ్డెర కాలనీలో 40 వేల లీటర్ల నీటి సామర్థ్యం గల వాటర్ ట్యాంకు కు ఎంపీపీ లకావత్ మానస, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు భూమి పూజ చేశారు. వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం రూ.20 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా ఈ ఎండాకాలంలో నీటి బిందెతో బయటికి వెళ్లొద్దని దృఢ సంకల్పంతో మంత్రి పోన్నం ప్రభాకర్ పనిచేస్తున్నాడని  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఆర్ డబ్ల్యూ ఎస్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రుహినా తస్కిన్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ‌.ఈ మమత, ఎంపీడీవో వేణుగోపాల్, పిసిసి మెంబర్ కేడం  లింగమూర్తి, హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంక చందు, గ్రామ శాఖ అధ్యక్షులు సంఘ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love