నవతెలంగాణ – కాటారం
కాటార్ మండల కేంద్రంలో నూతనంగా ప్రతిష్టాపన చేయమన్న తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహ నిర్మాణానికి మంగళవారం పెద్దపెల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, భూపాలపల్లి జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం దోపిడ విముక్తి కోసం జరిగిన నాటి సాయిధ రైతాంగ పోరాటంలో చాకిలి ఐలమ్మ పాత్ర కీలకం అన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం సర్పంచ్ తోటరాదమ్మ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎంపిటిసి తోట జనార్ధన్, ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్, యూత్ మండల అధ్యక్షులు రామిళ్ళ కిరణ్, రత్న సౌజన్య, వంగల రాజేంద్ర చారి, మందుల లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.