భూపాలపల్లి కాంగ్రెస్‌ బైక్‌ ర్యాలీ

భూపాలపల్లి కాంగ్రెస్‌ బైక్‌ ర్యాలీ
భూపాలపల్లి కాంగ్రెస్‌ బైక్‌ ర్యాలీ

నవతెలంగాణ భూపాలపల్లి: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్‌ నేతలు జెన్‌కో అతిథిగృహం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాహుల్‌గాంధీతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేత మధుయాష్కీతో పాటు మరికొందరు ముఖ్యనేతలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ర్యాలీకి తరలివచ్చారు. ర్యాలీ నేపథ్యంలో ములుగు నుంచి భూపాలపల్లి వైపు వెళ్లే వాహనాలను జెన్‌కో అతిథిగృహం వద్ద దారి మళ్లించారు.

Spread the love