ఎనిమిది వేల కోట్లతో జహీరాబాద్ పార్లమెంట్ అభివృద్ధి: బీబీ పాటిల్

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
జహీరాబాద్ పార్లమెంట్ సిగ్మెంట్ను ఎనిమిది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ స్పష్టం చేశారు.  శనివారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. గత పది సంవత్సరాలుగా జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎనిమిది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసినట్లు ఆయన తెలిపారు. గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తాను కాంట్రాక్టు తీసుకొని పని నిర్వహించలేదని నేను బిజినెస్ బీబీ పాటిల్ కాదని ప్రజల బీబీ పాటిల్ అని ఆయన తెలిపారు.  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తరు. గాలి మాటలు మాట్లాడొద్దని పనులు చేతనైతే చేతలు చేసి చూపాలని ఆయన సవాల్ విసిరారు.
జహీరాబాద్ సిగ్మెంట్లో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అభివృద్ధి పనులు నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో జాతీయ రహదారులు గాని రైల్వేలు గాని విద్యారంగంలో గాని ఆరోగ్య సంరక్షణలో గాని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో గాని పలు రకాల అభివృద్ధి సాధించినట్లు ఆయన తెలిపారు. దేశంలో జాతీయ రహదారిలో నెంబర్వన్ గా జహీరాబాద్ పార్లమెంట్ పరిధి ఉన్నదని ఆయన తెలిపారు. ఎంపీగా తాను చేసిన పనులన్నీ గూగుల్ లో సెర్చ్ చేసి చూసుకోవాలని ప్రతిదీ లెక్క ప్రకారం చేస్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 26 కార్పొరేషన్లో డిక్లేర్ చేయడం జరిగింది కానీ దానికి సంబంధించిన ఫండ్స్ ఇప్పటివరకు ఒకటి కూడా విడుదల చేయలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో దేశంలో బిజెపి పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని ఆయన భీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డబుల్ డిజిట్ విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లక్ష మెజారిటీతో జహీరాబాద్ పార్లమెంటు బిజెపి కైవసం చేసుకుంటుందని ఆయన తెలిపారు. ఎల్లారెడ్డి కి సంబంధించిన ఎంపీ నిధులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కు ఇవ్వడం జరిగిందని అభివృద్ధి కొరకు నిధులు ఖర్చు పెట్టాలని ఎమ్మెల్యేకు చెప్పడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలో హామీలు ఎక్కడ సరిగా ఇప్పటికీ అమలు కాలేదని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార తో పాటు నాగిరెడ్డిపేట్ బిజెపి మండల అధ్యక్షుడు శ్రీకాంత్ మాజీ అధ్యక్షులు హనుమండ్లు తోపాటు నాయకులు కిషన్, శ్రీనివాస్ తదితరులు.
Spread the love