బీర్కూర్ లో ఘనంగా గంప జాతర

Big Gampa fair in Birkurనవతెలంగాణ – నసురుల్లాబాద్ 
బీర్కూర్ మండల కేంద్రంలో గైపీర్ల దర్గా గంప జాతరను ఆదివారం గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపిపి రఘు ఆధ్వర్యంలో నైవేద్యాలను ఊరేగింపుగా తీసుకెళ్లి గైపీర్ల వద్ద సమర్పించి ప్రజలు తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రఘు మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఏటా ఈ పండుగను నిర్వహిస్తామన్నారు. వర్షాలు సమృద్ధిగా పడాలని పిల్లాపాపలతో అందరూ సంతోషంగా ఉండాలని ఈ పండుగ జరుపుకుంటామని ఆయన తెలిపారు. ఈ జాతర కు బీర్కూర్ మండల చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలి వస్తారు.
Spread the love