బీజేపీ, బీఆర్ఎస్ లకు బిగ్ షాక్…

– చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు 
– రామక్కపేట గ్రామస్తులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానం
నవతెలంగాణ దుబ్బాక రూరల్: దుబ్బాకలో బీజేపీ, బీఆర్ఎస్ లకు బిగ్ షాక్ తగిలింది. దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన సుమారుగా 50 మంది మహిళలు, గ్రామస్తులు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు రాజీనామా చేశారు. శుక్రవారం రామక్కపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలకిషన్ ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి చెరుకు శ్రీనివాస్ రెడ్డి సాధారంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. యావత్ ప్రజలు రాష్ట్రంలోనూ, దేశంలోనూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వారు అన్నారు. దుబ్బాక గడ్డపై తిరిగి కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని నమ్మి నేడు పార్టీలో రామక్క పేట గ్రామస్తులు చేరారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్, దుబ్బాక మండల కాంగ్రెస్  అధ్యక్షులు కొంగరి రవి, ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, దుబ్బాక మున్సిపాల్ జనరల్ సెక్రెటరీ మంద శ్రీనివాస్, దుబ్బాక నియోజకవర్గం అసెంబ్లీ జనరల్ సెక్రటరీ ఆకుల భరత్, దుబ్బాక మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లక్ష్మి తదితరులు ఉన్నారు.

Spread the love